ఈ నెల 28న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక

- Advertisement -

ఈ నెల 28న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక

The arrival of the Chief Justice of the Supreme Court on 28th of this month

తిరుపతి, సెప్టెంబర్ 26
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ  వై. చంద్రచూడ్ రు ఈ నెల సెప్టెంబర్ 28,29 తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారు ఈ నెల 28న శనివారం సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి  చేరుకొని రాత్రి బస చేసి మరుసటి దినం సెప్టెంబర్29న ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరుమల చేరుకొని, తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల నుండి బయలుదేరి తిరుపతి చేరుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం  మద్యాహ్నం 2:35  గంటలకు తిరుపతి విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular