గుర్తు తెలియని వయోవృద్ధునీ మృతదేహం లభ్యం..
శేరిలింగంపల్లి, డిసెంబర్ 5(వాయిస్ టుడే):
The body of an unidentified elderly man has been found.
లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వయోవృద్ధునీ మృతదేహం లభ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 6 సమీపంలో సుమారు 70 ఏండ్ల వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించడంతో వృద్ధుడు అప్పటికే మరణించి ఉన్నాడు. కాగా మృతుని వేషధారణను బట్టి యాచకుడిగా అనుమానిస్తున్నారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 9490617118,8712663184 నంబర్లలో సంప్ర దించాలని పోలీసులు సూచించారు.


