*దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము* ”
The country is on the path of development.
*భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు* . జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మేకిన్ ఇండియాకు అధికప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. .. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామంటూ.. వాతావరణంలో వచ్చే విపత్తులు సమస్యలుగా మారాయన్నారు. 80 కోట్ల మందికి రేషన్ ఉచితంగా ఇచ్చామన్నారు. అన్నదాతల వల్లదేశం శుభిక్షంగా ఉందన్నారు.




