- Advertisement -
సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవం కావాలి
The election of Sarpanchs should be unanimous
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం జరిగిన సీఎల్సీ సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. శాసన సభ ఎన్నికల్లో నియోజకవర్గాల్లోని గ్రామాలకు ఇచ్చిన హామీల అమలుకు ముందడుగు వేయాలి. సీసీ రోడ్లు, గుళ్ళు,ఇతర నిర్మాణ అనుమతులు,నిధుల మంజూరు సంబంధిత మంత్రులను కలవాలి. ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బీసీలకు 42శాతం స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదే నని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ల సమావేశం .హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గోన్నారు.
- Advertisement -