Wednesday, October 16, 2024

జాతీయ పండుగగా గుర్తించే దాకా ప్రభుత్వం పట్టువదలదు:మంత్రి కొండా సురేఖ..

- Advertisement -

సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న మంత్రి కొండా*

The government will not persist until it is recognized as a national festival: Minister Konda Surekha..
The government will not persist until it is recognized as a national festival: Minister Konda Surekha..
The government will not persist until it is recognized as a national festival: Minister Konda Surekha..

*• జాతీయ పండుగగా గుర్తించే దాకా ప్రభుత్వం పట్టువదలదు*

*• రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించాలి*

*- మంత్రి కొండా సురేఖ..*

*వాయిస్ టుడే, ఉమ్మడి వరంగల్:* ములుగు జిల్లాలలో కొలువైన వనదేవతలు సమ్మక్క సారలమ్మ లను రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ మురళీధర్ రావు దంపతులు కూతురు సుస్మిత పటేల్, అల్లుడు అభిలాష్, మనవడు శ్రీయాన్ష్ మురళీకృష్ణతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు నిలువెత్తు బంగారం సమర్పించి తమ మనవడి తలనీలాలు తీశారు. అనంతరం సమ్మక్క సారక్కల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క పూజారులు మంత్రి కి అమ్మవార్ల చీరె, పసుపు కుంకుమలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించే దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టువదలదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన జాతరను దిగ్విజయవంతంగా చేపట్టిందని గుర్తు చేశారు. దేవాదాయ శాఖ తరఫున మంత్రిగా తాను, గిరిజన బిడ్డ మంత్రి సీతక్క సమ్మక్క సారక్క జాతర ప్రాంత అభివృద్ధి కోసం, సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. తమ కులదైవమైన సమ్మక్క సారక్కలను ప్రతియేడు దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించాలనీ, రాష్ట్ర ఆర్థిక కష్టాలు గట్టెక్కాలనీ మంత్రి సురేఖ ప్రార్థించారు. రాష్ట్ర ప్రదాత అయిత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాల సాధనకు వనదేవతలు శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. మంత్రికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్