Wednesday, January 8, 2025

విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్దం..ఇద్దరు సజీవ దహనం

- Advertisement -

విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్దం..ఇద్దరు సజీవ దహనం

The house caught fire with electric shock..Two were burnt alive

బాపట్ల
బాపట్ల జిల్లాలోని పర్చూరులో విషాదం చోటుచేసుకుంది.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు చెలరేగి అక్కా చెల్లెళ్ళు సజీవ దహనం అయ్యారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పర్చూరు రామాలయం వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాసరి వెంకటేశ్వర్లుకు చెందిన ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే తేరుకున్న తల్లి లక్ష్మీరాజ్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో మంటల్లో చిక్కుకున్న తన ఇద్దరు కుమార్తెలను కాపాడటానికి తల్లి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో అగ్నిప్రమాదంలో చిక్కుకుని కదలలేని స్థితిలో వికలాంగురాలిగా ఉన్న అక్క దాసరి నాగమణి (34), చెల్లెలు దాసరి మాధవి లత (30) సజీవ దహనమయ్యారు. కళ్ళ ముందే ఇద్దరు కూతుళ్ళు సజీవ దహనం అవుతుండటంతో తల్లి తల్లడిల్లిపోయింది. గుండెలవిసేలా రోదించింది.
సమాచారం అందుకున్న చీరాల ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే మృతి చెందిన అక్కాచెల్లెళ్ళ మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమార్తెలను కాపాడుకోబోయి తీవ్ర గాయాలపాలైన తల్లి లక్ష్మీరాజ్యంను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్