పర్యావరణ పరిరక్షణ భావజాలం అందరిలో పెరగాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 18
మానవ తప్పిదాలతో సమాజం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, భావితరాల మనుగడకోసం ప్రతి ఒక్కరూ విధిగా పర్యావరణ భావజాలాన్ని అలవర్చుకోవాలని కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్ పురాలోని తన నివాసంలో ప్రముఖ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ సంస్థ “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” ఆధ్వర్యంలో రూపుదాల్చిన ‘ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ’ అనే మాసపత్రికను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణ భావజాలంతో ఒక ప్రత్యేక మాసపత్రికను తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా పత్రిక సంపాదకులు, ఎన్విరాన్మెంట్… కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య ను కేంద్ర మంత్రి అభినందించారు. పర్యావరణాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రతి అంశం మీద తమ సంస్థ పోరాట పంథాలో ముందుకు సాగుతోందని, దాంతోపాటు పర్యావరణ స్పృహ జనంలో మరింత తీసుకు వచ్చేందుకు ఈ పత్రిక తీసుకు వస్తున్నామని ఈ సందర్భంగా రంగయ్య మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వాదులు, సీనియర్ పాత్రికేయులు సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ భావజాలం అందరిలో పెరగాలి
- Advertisement -
- Advertisement -