భారత ఆర్థిక అక్షయ పాత్ర శీలురు స్వర్గీయ పీవీ నరసింహారావు

- Advertisement -

భారత ఆర్థిక అక్షయ పాత్ర శీలురు స్వర్గీయ పీవీ నరసింహారావు

మంథని
1990 దశకం లో భారత ఆర్థిక వ్యవస్థ ను  అతాలకుతలం నుండి వెలికి తీసి వెలుగులతో అక్షయ పాత్ర గా తీర్చిన ఘనత ఆనాటి ప్రదాన మంత్రి స్వర్గీయ పి.వి నరసింహారావు దని పలువురు వక్తలు  కొనియాడారు.
భారత మాజీ ప్రధాని, భారతరత్న పివీ నరసింహారావు జయంతిని  పురస్కరించుకుని శుక్రవారం మంథని పట్టణంలోని మంథని విద్యార్థి యువత కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు  కొండేల మారుతి అధ్యక్షత న జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ
1957 సం లో మంథని నుండి  ఎం ఎల్ ఏ గా మొదలైన పి వి రాజకీయ ప్రస్థానం  దేశ ప్రధాన మంత్రి వరకు కొనసాగిన తీరు తెన్నులను  విశ్లేసించారు.  ప్రపంచ మేధోనిధి గా విఖ్యాతులైన పీ వీ జీ ని భారత రత్న వరించడం మహద్బాగ్యామంగా జాతి గర్వించిందన్నారు. ముగింపు అంకం లో పీ వీ కి ఆటంకాలు ఎదురైనా ఆదీ కొందరీ కుటిలత్వమేననీ ప్రపంచం గుర్తించి దన్నారు.
ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సత్యప్రకాశ్ , సామాజిక స్రష్ఠ రామాడుగు మారుతీ రావు ,ఫీలిం సెన్సార్ బోర్డు సభ్యులు భోగోజు శ్రీనివాస్ ,సీనియర్ సిటిజన్స్ ఫోరం కన్వీనర్ తాటి బుచ్చన్న గౌడ్ , సర్వ చిన్న బాపు లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular