గాంధీభవన్ కు తాకిన నర్సాపూర్ గాలి మంటలు కాంగ్రెస్ అభ్యర్థినీ మార్చాలంటూ ధర్నా, పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే యత్నం
నర్సాపూర్ అక్టోబర్ 29 వాయిస్ టుడే : మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థినీ మార్చాలంటూ నర్సాపూర్ గాలి మంటలు గాంధీభవన్ కు తాకాయి. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డినీ మార్చాలంటూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఆదివారం పెద్ద ఎత్తున గాంధీభవన్ కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ భవనం ఎట్ల పై కూర్చొని నర్సాపూర్ టికెట్ బీసీలకు ఇవ్వాలని బీఆర్ఎస్ కోవర్టుకు ఇవ్వడం తగదని, దీంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. రాజిరెడ్డికి టికెట్ రద్దు చేయాలని నర్సాపూర్లో బీసీ నినాదం బలంగా ఉందనీ, కాబట్టి బీసీ నాయకులు టీపిసిసి ఉపాధ్యక్షులు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఇస్తే, ఆయనను భారీ మెజార్టీ మెజార్టీతో గెలిపించుకొని, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికీ గిఫ్ట్ గా ఇస్తామని ఇక్కడి నుంచి తరలి వెళ్లేన నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. ఇదే సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన నర్సాపూర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేయగా నాయకులు అతడిని ప్రయత్నాన్ని నిలుపుదల చేశారు. నర్సాపూర్ టికెట్ మార్చకుంటే కాంగ్రెస్ కనుమరుగవుతుందని కార్యకర్తలు వాపోయారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ ఆత్నూర మండలఅధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి ఎంపీటీసీలు, సర్పంచులు,వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం ఉదయ్ కుమార్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు అంజనేయులు లతోపాటు అన్ని మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గాంధీభవన్ కు తాకిన నర్సాపూర్ గాలి మంటలు కాంగ్రెస్ అభ్యర్థినీ మార్చాలంటూ ధర్నా, పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే యత్నం
- Advertisement -
- Advertisement -