జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
The National Agricultural Market Policy should be rolled back
అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు ధర్నా
జీవో కాపీలను దగ్ధం చేసిన రైతు సంఘం నాయకులు
నరసరావుపేట,
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర
ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నరసరావుపేటలో గాంధీ పార్క్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జీవో కాపీలు
దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు దల్లేవాలు ప్రాణాలు కాపాడాలని, ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులపై అణచివేతను ఆపాలని, అక్రమంగా
నిర్బంధించిన నోయిడా గ్రేటర్ నోయిడా రైతులందరినీ లక్సర్ జైలు నుండి తక్షణమే విడుదల చేయాలని, జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కేరళ తరహాలో రుణమాఫీ చట్టాన్ని అమలు
చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ద్వారా ద్రౌపది ముర్ము కి లేఖ పంపడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కె
వి వి ప్రసాద్ మాట్లాడుతూ,13 నెలలు పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నామని చెప్పిన వారు, నేడు దొడ్డిదారిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం
పేరుతో వ్యవసాయం మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేదానికోసం ప్రయత్నం చేయడం రైతులను వంచించటమేనని విమర్శించారు. అదేవిధంగా ఆహార సబ్సిడీ పై నగదు బదిలీని ప్రోత్సహించడం, ఆహార భద్రత
దెబ్బతీయటంలో భాగంగా ఎఫ్సిఐ ని నిర్వీర్యం చేయటం, ఆహార సబ్సిడీని, ఎరువులు సబ్సిడీని గత మూడు సంవత్సరాలుగా తగ్గిస్తూ రావటం వ్యవసాయం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని
విమర్శించారు. కావున రైతాంగం ఐక్యంగా నిలబడి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు
వై రాధాకృష్ణ మాట్లాడుతూ, గత రైతాంగ పోరాట సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ అమలు జరపకుండా, నేడు వ్యవసాయ మార్కెట్ల ను దెబ్బతీసి కార్పొరేట్లకు అప్పజెప్పే దానిలో భాగంగా ఈ విధానాన్ని
తీసుకురావడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా స్వామినాథన్ సిఫారసులు ప్రకారం గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, మరియు కేరళ తరహాలో రుణమాఫీ చట్టం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేకుంటే మరోసారి రైతాంగం ఢిల్లీ తరహా పోరాటం నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు.
ఆల్ ఇండియా కిసాన్ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులు భారతదేశంలో
వ్యవసాయాన్ని కబళించడానికి పూనుకొంటుందని దానికి పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలకటం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన డిమాండ్లు పరిష్కారం చేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం
ముందుకు రావాలని కోరారు.
ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్ బాష మాట్లాడుతూ డిసెంబర్ 9, 2021 నాడు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు జరిపే దానికోసం
వెంటనే రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూసి కేంద్ర ప్రభుత్వ చర్యలను రైతాంగం ఐక్యంగా
ఎదుర్కోవాలని, వీరికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము, అధ్యక్షులు గుంటుపల్లి బాలకృష్ణ, లక్షాధికారి నల్లపాటి రామారావు, వలి, సైదా,
హరిబాబు, బోసు తదితరులు పాల్గొన్నారు.