Monday, March 24, 2025

‘ది ప్యారడైజ్’ పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ‘రా స్టేట్‌మెంట్’ .మార్చి 26, 2026న థియేటర్లలో మూవీ రిలీజ్

- Advertisement -

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ ‘ది ప్యారడైజ్’ పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ‘రా స్టేట్‌మెంట్’ .మార్చి 26, 2026న థియేటర్లలో మూవీ రిలీజ్

'THE PARADISE' POWERFUL EPIC JOURNEY 'RAW STATEMENT' .Movie Releasing in Theaters on March 26, 2026

నేచురల్ స్టార్ నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన రా అండ్ రస్టిక్ బ్లాక్ బ్లాక్ బస్టర్ ‘దసరా’ ప్రేక్షకులని అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. నాని మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, SLV సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరితో కలిసి మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయ్యారు. వారి న్యూ మూవీ ‘ది ప్యారడైజ్’ లో నాని మరో బోల్డ్, లార్జర్-దాన్-లైఫ్ పాత్రలో అలరించబోతున్నారు.
ఈరోజు, మేకర్స్ ‘రా స్టేట్‌మెంట్’ అనే గ్లింప్‌ను రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుండే “రా” అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో అర్థం వచ్చేలా ప్రజెంట్ చేసింది. భాష, కథనం, నేపథ్యం అన్నీ అన్ రిఫైండ్ గా వున్నాయి. ఒక పవర్ వాయిస్ ఓవర్ కథ ముఖ్యాంశాన్ని అందిస్తుంది. “చరిత్రలో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్ లు పట్టినాయ్. ఇది ఆ కాలులని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ ఇది.. ఆ యువకుడు నాయకుడిగా మారిన కథ’ ఈ పవర్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులని కట్టిపడేసింది.
బిగినింగ్ షాట్లు మృతదేహాలతో నిండిన మురికివాడలను, ఎగురుతున్న కాకులను చూపుతాయి. ఆ తర్వాత, ఒక భారీ పేలుడు హీరో నాని ఎంట్రీని సూచిస్తుంది, అతను ఊహించని గెటప్‌లో బయటకు వస్తాడు. బూట్లకు కట్టుకున్న గడియారం, నీటిలో నుండి తీసిన తుపాకీతో రగ్గడ్ లుక్‌తో, దృఢ సంకల్పంతో నడుస్తూ, తన ప్రజలను గర్వంతో నడిపిస్తాడు. అతని లాంగ్వేజ్ ఫిజిక్, రెండు జడలతో హైలైట్ చేయబడింది. పాత్ర ఇంటన్సిటీని వెంటనే తెలియజేస్తుంది. హీరో అనే పదంతో అతని బెల్ట్, ప్రజల నాయకుడిగా అతని పాత్రను సూచిస్తుంది.
తల్లి, కొడుకు విప్లవం యొక్క ఈ రా అనౌన్స్ మెంట్, ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ కథనాన్ని, మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని సూచిస్తుంది. అతని అద్భుతమైన మేకోవర్ అడిరిపోయింది. ఇది ప్రారంభం మాత్రమే, ఈ చిత్రం తిరుగుబాటు, నాయకత్వం యొక్క వరల్డ్ లోకి ఒక ఎపిక్ జర్నీగా ఉంటుందని హామీ ఇస్తుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన విజనరీ ఫిల్మ్ మేకర్ ని నిరూపించుకున్నాడు, మొదటి ఫ్రేమ్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంటెన్స్, లీనమయ్యే ప్రపంచాన్ని అద్భుతంగా చూపించాడు.ఎక్స్ ట్రార్డినరీ స్టొరీ టెల్లింగ్, ఇంటెన్స్ తో కూడిన పాత్రను ప్రదర్శించడం ద్వారా నాని ప్రజెన్స్ రీడిఫైన్ చేశాడు.
రా స్టేట్‌మెంట్ ప్రతి విభాగంలోనూ అద్భుతంగా కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు ఇంటెన్స్ ప్రిమైజ్, బ్రెత్ టేకింగ్ విజువల్స్‌ అందించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ ప్రత్యేకంగా నిలుస్తుంది, ప్రతి బీట్‌తో హై-స్టేక్స్ కథనాన్ని ఎలివేట్ చేసింది. అతని సంగీతం అడ్రినలిన్-పంపింగ్ మూమెంట్స్ ని అందిస్తోంది.

అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ రా స్టేట్‌మెంట్ లలో మరొక అద్భుతమైన ఎలిమెంట్. ఓదెల సృష్టించే ప్రపంచం రా, ఇంటెన్స్ బిలివబుల్ గా వుంది. దుస్తుల, సెట్ డిజైన్ వరకు ప్రతిది ప్రేక్షకులను ఈ సినిమా యూనివర్స్ లోకి తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ అదిరిపోయింది. SLV సినిమాస్ నిర్మాణ విలువలు ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. సినిమా గొప్పతనం ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపించాయి.
తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ ఐదు భాషలలో విడుదలైన ది రా స్టేట్‌మెంట్ ఊహించని వాటిని అందిస్తుంది, కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. సినిమాటిక్ ఎక్సలెన్స్ కోసం అంచనాలని పెంచింది . గ్లింప్స్ కన్నడ, మలయాళం & బెంగాలీ వెర్షన్‌లు త్వరలో విడుదల కానున్నాయి. ఈ చిత్రం పాన్-వరల్డ్ విడుదల అవుతుంది.
రా స్టేట్‌మెంట్ ద్వారా అనౌన్స్ చేసినట్లుగా, ది ప్యారడైజ్ మార్చి 26, 2026న థియేటర్స్ లో విడుదల కానుంది.
తారాగణం: నాని

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్