ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గ్రాండ్ థియేట్రిల్ రిలీజ్ కు వస్తున్న పొయెటిక్ మూవీ “కాలమేగా కరిగింది”
The poetic movie "Kaalamega Karindi" will be released on the 21st of this month.
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “కాలమేగా కరిగింది”. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ ఫిల్మ్ “కాలమేగా కరిగింది” ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, ‘ఊహలోన ఊసులాడే..’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టిక్ వ్యాల్యూస్ ఉన్న లవ్ స్టోరీగా “కాలమేగా కరిగింది” సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
నటీనటులు – వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు