రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది

- Advertisement -

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది

The problem of unemployment in the state is getting worse

ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది
నేటితో 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం
ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్
హైదరాబాద్ హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమి ‘రోజ్ గార్ మేళా’లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  పాల్గోన్నారు.
పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ లోని అశోక్ నగరలో తినతినడికి తిండిలేక పస్తులుంటూ ఒక్కపూట భోజనమే తింటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు. ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం హర్షణీయమన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రధానమంత్రి మోదీ మాట ఇచ్చారని, దానికి కట్టుబడి నేటి వరకు ‘రోజ్ గార్ మేళా’ పేరుతో 9.25 లక్షల మందిని నియామక పత్రాలను అందజేశామన్నారు. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రీయల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన ‘రోజ్ గార్ ’’ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ సునీల్ ఇమ్మాన్యూయెల్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసబాబుతోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఉద్యోగ పత్రాలు అందుకోబోతున్న 300 మందికిపైగా అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
గతంలో మోదీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటిస్తే…. ప్రతిపక్షాలు హేళన చేశాయి. కానీ ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్ ఆర్దిక వ్యవస్థ 4 కోట్ల 66 లక్షల ఉద్యోగాలను స్రుష్టించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్రమోదీదే. గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘనత మోదీకే దక్కుతోంది.

మోదీకి విజన్ అమోఘం. 1999లోనే అమెరికా వెళ్లినప్పడు అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ‘ఈ దేశంలోని ప్రవాస భారతీయులంతా ఒక్కొక్కరు మరో ఐదుగురికి ఇండియాలో పర్యటించేలా చేయండి. వారు ఇండియాలో పర్యటించడం ద్వారా వారంతా ఇండియాకు రావడం ద్వారా పర్యాటక అభివ్రుద్ధితోపాటు మన దేశ ఉత్పత్తులను కొనే అవకాశముంది. తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది.’’అని పేర్కొన్నారు. అంతటి విజన్ ఉన్న మోదీ ఆధ్వర్యంలో భారత్ కచ్చితంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకోవడం తథ్యమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular