Thursday, November 7, 2024

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలి

- Advertisement -

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలి

The problem of victims coming to the police station should be solved

రామగుండం పోలీస్ కమిషనర్  ఎం శ్రీనివాస్.
కమాన్ పూర్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్  (ఐజి) ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు.  రిసెప్షన్ సందర్శించి రికార్డు లు చెక్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదు ల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులు కు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. సిబ్బంది తో మాట్లాడివారు చేసే విధులు మరియు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం జరిగింది.పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రజల గురించి, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బంది తో మాట్లాడి డయాల్ 100 కాల్స్ కి స్పందించి, వారు సంఘటన స్థలం కి చేరుకొన్న టైం వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. నైట్ టైం లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా సేకరించాలని మరియు బ్లూ క్లోట్స్ సిబ్బంది విధులు అడిగి తెలుసుకోవడం జరిగింది. పెట్రో కార్ వాహనంలలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్  రిబ్బన్, రైట్ గేర్ కిట్( హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ఫ్రొటెక్టర్) లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, ఇంపార్టెంట్ పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. స్కూల్స్, కాలేజీ, ప్రధాన కూడాళ్ళ వద్ద విశబుల్ పోలీసింగ్ ఉండాలి, ఆకస్మిక వాహన తనిఖీ లు నిర్వహించాలి. గంజాయి మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం,  చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ నక్క ప్రసాద్ రావు, ఎస్ఐ కొట్టే ప్రసాద్ ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్