పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

The problems of pensioners should be resolved

టీ పెన్షనర్స్ రాష్ర్ట కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

జగిత్యాల
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రభుత్వంను కోరారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో  తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2025 క్యాలెండర్లను,డైరీలను సబ్యులకు అందజేశారు. డిసెంబర్ 17 న జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా జరపాలని తీర్మానించారు.అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని,మార్చి 2024 నుంచి రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సిన జి.పి.ఎఫ్,గ్రాట్యుటీ,కమ్యూటేషన్,లీవ్ సాలరీ,తదితర ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని,వైద్య ఖర్చుల బిల్లులు సత్వరం చెల్లించాలని,పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని,తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంను కోరారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం,సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షులు వేల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కే.సత్యనారాయణ మహిళా కార్యదర్శి కరుణ,,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్,ఉప్పుగళ్ల మురళీధర్, జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,మెట్ పల్లి అధ్యక్షుడు గంగాదర్,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్, కార్యదర్శి దుబ్బేశం,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular