పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేల ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
The public government should take steps to revive the old pension system
-తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించిన గొల్లపల్లి పిఆర్టియు-టిఎస్ నాయకులు
గొల్లపల్లి,
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేల ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పిఆర్టియు-టిఎస్ గొల్లపల్లి మండల అధ్యక్షుడు రాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొండ్ర దేవేందర్ లు కోరారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి నేరుగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ పిఆర్టియు-టిఎస్ గొల్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు గొల్లపల్లి తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పిఆర్టియు- టిఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేని నేషనల్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రవేశ పెట్టడల జరిగిందని భద్రత లేని ఈ సిపిఎస్ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారన్నారు. దీని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా కొన్ని మెరుగులు అద్ది పాత పెన్షన్ పోలి ఉండేలా చూసి తమ ఉద్యోగులకు తేది 01.04.2025 నుండి యుపిఎస్ (సమీకృత పెన్షన్ స్కీమ్)ను అమలు చేయనున్నారన్నారు. అదే విధంగా రాష్ట్రాలను ఈస్కిమ్ అమలు చేయమని కోరే అవకాశం ఉందని అన్నారు.
తెలగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పి ఎఫ్ ఆర్ డి ఏ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏ విధమైన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకుంటారని ఆప్షన్ కోరగా సిపిఎస్ విధానం నుండి వైదొలగటానికి అవకాశం వచ్చినప్పటికీ నాటి తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 23,2014 నాటి 28 జీవో ద్వారా సిపిఎస్ విధానాన్ని కొనసాగించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని వాపోయారు.
సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విదంగా ప్రభుత్వానికి తెలియజేయాలని తహసిల్దార్ ద్వారా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు- టిఎస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంధి శ్రీనివాస్ రెడ్డి, ఏ రత్నాకర్ రావు, చేన్న కరుణాకర్, ఎస్ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి రమేష్, ఏ నరేందర్, గొల్లపల్లి అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామి, నాయకులు రవి, అశోక్, దయాకర్, తిరుపతి,రాము లతోపాటు తదితరులు పాల్గొన్నారు.