- Advertisement -
హామీలు, వాగ్ధానాలను నెరవేర్చడం లో రేవంత్ ప్రభుత్వం వైపల్యం
The Revanth government has failed in fulfilling its promises
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్
హైదరాబాద్ డిసెంబర్ 2
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు, గ్యారంటీలు, హామీలు నెరవేరుస్తారనుకుంటే.. ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను నెరవేర్చకుండా వైపల్యం చెందిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు.సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సంవస్సర పాలనలో రేవంత్ సర్కారు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ఖీళీ పాత్రలే ఎక్కువ శబ్ధం చేస్తాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాల్లో విఫలమయ్యారు.ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటూ గా మారిండు.పేదల ఇండ్లు కూల్చివేస్తూ గా అవతారమెత్తారు.తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాల్జేసి, రాష్ట్రానికి విలువలేకుండా చేసి గా దిగజారిండు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చుతూ డైవర్షన్ మెన్ మారాడన్నారు. ఉద్యోగాలడిగితే నిరుద్యోగులపై లాఠీచార్జ్, బోనస్ ను బోగస్ చేసి, రుణమాఫీ అరకొరతోనే సరిపెట్టి, భూములు గుంజుకొని రైతులను వేధించిన్రు.మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, దళిత, గిరిజనులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అనారోగ్యం పాలు…. ఇలా అన్ని వర్గాల ప్రజలు దగాకు గురయ్యారు.నరేంద్ర మోదీ వికాస్ మంత్రతో దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అభివృద్ధి విరోధకంగా మారాయన్నారు.
- Advertisement -