దేశంలోనే సన్నబియ్యం పథకం చారిత్రాత్మకం:
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
The Sanna Biyyam scheme is historic in the country: Minister Ponnam Prabhakar
కరీంనగర్ ప్ర
కరీంనగర్లో సన్న బియ్యం పంపిణీ
పథకానికి శ్రీకారం
పేదలకు సన్న బియ్యం పంపిణీ
భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మక మని, ముఖ్యమంత్రి పేదల కోసం మహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా తినదగిన బియ్యం సరఫరా చేస్తామని, ఈ పథకం పేదల గుండెల్లో నిలిచే పథకమని మంత్రి పేర్కొన్నారు.
కరీంనగర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ లో మంగళవారం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు తమ ప్రభుత్వం అందిస్తున్నదని, ఈ పథకాన్ని పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని మంత్రి వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 566 రేషన్ షాపుల ద్వారా 2,76,930 రేషన్ కార్డ్ దారులకు, ఎనిమిది లక్షల పదివేల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెల ఒక్కొక్కరికి ఆరు కిలో చొప్పున సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వానాకాలంలో 72 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, దీని ద్వారా 34 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యం పండించేందుకు రైతులకు ఎకరానికి బోనస్ 500 రూపాయల చొప్పున అందిస్తున్నదని తెలిపారు. రైతులకు దాదాపు 36 కోట్ల రూపాయలు సన్న రకం వరి ధాన్యానికి బోనస్ కింద అందించామని చెప్పారు. పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ సర్కారు ఇలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయ మన్నారు. పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కరీంనగర్ లో తాగునీటికి ఎలాంటి డోకా లేదని, కొందరు ప్రజలను కన్ఫ్యూజన్ చేసేందుకు తాగునీటి సమస్య ఉందని రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కరీంనగర్లో జూలై వరకు ఎలాంటి తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని, ఒకవేళ ఎక్కడైనా తలెత్తినా అధికారులు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఎల్ఎండి రిజర్వాయర్లో ప్రస్తుతం 5.70 టీఎంసీల నీరు ఉందని, జూలై నెల వరకు కరీంనగర్ లో తాగునీటి సమస్యకు ఎలాంటి డోకా లేదని తెలిపారు. మిడ్ మానేర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 8.78 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. తాగు నీటిపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని, ఒకవేళ ఎక్కడైనా తలెత్తిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సమర్థవంతంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తాగునీటిపై రాజకీయం చేసే వారిని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ పథకం విప్లవాత్మకమైం దని ప్రజలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధనికులు తినే బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా పనిచేస్తుందని తెలిపారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం అందించిన నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పేదలకు సన్న రకం బియ్యం అందిస్తున్నదని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ఆలోచించి ఈ మహత్తరమైన పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకే సన్న రకం బియ్యం పంపిణీని ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. పేద ప్రజలంతా సన్నరకం బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి పలువురూ లబ్ధిదారులకు సన్నారకం బియాన్ని పంపిణీ చేశారు. ఈ సమావేశంలో
అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, డీఎస్ఓ నర్సింగరావు, సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, అర్బన్ బ్యాంకు అసోసియేటెడ్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆకుల పద్మ ప్రకాష్ నేతి కుంట యాదయ్య, నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆకార భాస్కర్ రెడ్డి, మాచర్ల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.