శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
The state should be blessed with the blessings of Sri Vasavi Kanyakaparameshwari
రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా
ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని దర్శించున్న సీఎం చంద్రబాబు
అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ
అనంతరం గురుపీఠం నిర్మాణానికి శంకుస్థాపన
పశ్చిమగోదావరి/*పెనుగొండ, :-
పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆలయానికి 2,600 ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు. పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు శుక్రవారం దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన కలియుగ పార్వతీదేవిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. అహింస, ఆత్మ త్యాగం, శాంతి, ధర్మ నిరతికి ప్రతిరూపం అమ్మవారని దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అమ్మవారిని కొలుస్తారని ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.