హమాస్ తీవ్రవాదులు ప్రతీ ఇంటిని జల్లెడపడుతూ ఆ ఇళ్ళలో ఉండే యూదుల కుటుంబ సభ్యులను అందరినీ ఊచకోత కోస్తున్న విషయం తెలుసుకుని ఈ జంట తమ కవల పిల్లలను జాగ్రత్తగా తీవ్రవాదుల కంటపడకుండా ఇంట్లో ఒక గదిలో దాచిపెట్టి అనంతరం ఆ ఇంట్లోకి చొరబడిన తీవ్రవాదుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు వదిలారు.. 12 గంటల సమయం పాటు ఆ పసివాళ్లు ఒంటరిగా ఏడుస్తూ గడిపారు.. అనంతరం ఆ ప్రాంతంలో మిలటరీ ఆపరేషన్ లో అందరు తీవ్రవాదులను నిలువరించాక రెస్కూ టీం ఆ పసివాళ్లను కాపాడింది. ఈ పసివాళ్లు ఆ రాక్షసుల కంటపడినట్లైతే వారిలో సైతం బుల్లెట్లు దింపేవారు అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్ తీవ్రవాదులను క్రూర మృగాలతో సమానం అని ప్రపంచానికి ఇన్నాళ్లుగా చెప్తూ వచ్చింది. కానీ అవ్వన్నీ అభూత కల్పనలు అంటూ కొట్టిపారేశారు చాలా మంది.. అలాంటిది ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది మనిషి రూపంలో ఉండే పచ్చి నెత్తురు తాగే క్రూర మృగాలు ఎలా ఉంటాయో అని!



