- Advertisement -
పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఎదుట కార్మికులు ధర్నా
The workers staged a dharna in front of the Pidugurala municipalityకమిషనర్ పి. శ్రీధర్ కు కార్మికులు వినతి పత్రం
పిడుగురాళ్ల,
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కమిషనర్ పి. శ్రీధర్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కార్మికులకు సబ్బులు ,కొబ్బరి నూనె, యూనిఫామ్, చెప్పులు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, కరోనా సమయం నుండి పనిచేస్తున్న టి.ఎల్.ఎఫ్ కార్మికులను, ఎన్ ఎం ఆర్ లను ఆప్కా సమస్త లో చేర్చాలని, పండగ సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయాలని అన్నారు. విజయవాడ వరద సమయంలో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం అదనంగా ఇవ్వాలని, అదేవిధంగా పనిముట్లు, పుష్కాట్లను రిపేర్ చేయించాలని తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని కమిషనర్ ని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ,ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు మొగిలి ప్రతాపు, బత్తుల రామారావు , కాండ్రగుంట ఎల్లమంద ,మార్తమ్మ, మేరీ, రాగిరి శీను, వినోద్, గుంటినాగేశ్వరరావు, అంగడి శ్రీను , అనుష ,మనీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




