- Advertisement -
అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
The World Economic Forum conference started with a bang
హాజరైన మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
దావోస్ :
జ్యురిచ్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటల ప్రాంతంలో దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్ పై చర్చించేందుకు దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటుచేసిన నెట్ వర్కింగ్ డిన్నర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కలిసి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పారిశ్రామికవేత్తలకు వివరించింది.
- Advertisement -