నెల్లూరు జిల్లా:ఆగస్టు 14: జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. గుడ్లూరు మండలం వీరేపల్లి వద్ద సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ట్రైన్‌లో దుండుగులు చోరీ చేశారు.

ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు. అలాగే కావలి సమీపంలో సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో మరోచోరీ జరిగింది. రైళులోని ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.
ప్రయాణికుల నుంచి భారీగా బంగారం, నగదును దుండుగుల దోచుకున్నారు. అనంతరం ట్రైన్ చైన్ లాగి దొంగలు పరారయ్యారు. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దోపిడీ ఘటనపై ప్రయాణికులు తెట్టు, కావలి రైల్వే స్టేషన్లలోరైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు…