Monday, December 23, 2024

పరకాల కాంగ్రెస్ లో నాలుగు గ్రూపులు

- Advertisement -

వరంగల్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): అధికారమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన జోష్‌తో తెలంగాణలోనూ సత్తా చాటాలని చూస్తోంది. ప్పటికే మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెండో జాబితా విడుదల కోసం మేధో మథనం చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఢిల్లీ స్థాయిలో కసరత్తు జరుగుతుంది. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దింపేలా ఫ్లాన్ చేస్తోంది. అంతే ధీటుగా అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు బుజ్జగింపులు వేగవంతం చేస్తోంది.కొన్ని నియోజక వర్గాల్లో కొత్త నేతల ఎంట్రీతో టిక్కెట్ ఫైట్ ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పరకాల నియోజకవర్గం నుండి నలుగురు నాయకులు టిక్కెట్ రేసులో డీ అంటే ఢీ అనుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు పాత నాయకులు మీసాలు మెలేసుకుంటుంటే.. తాజాగా మరో ఇద్దరు కొత్త నాయకుల ఎంట్రీతో టీ కప్పులో తుఫాన్ వాతావరణం నెలకొంది. టిక్కెట్ రేసులో ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు.గత కొద్ది రోజులుగా మాజీ MLC కొండా మురళి నియోజక వర్గ ఇంచార్జ్ ఇనుగల వెంకట్రామిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గతంలో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు దిగాయి. అందులో భాగంగా పరకాలలో స్థానిక కాంగ్రెస్‌ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. అయితే కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి వర్గీయుల మధ్య ఈ సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. ఇరు వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగాయి. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఈ ఇద్దరు నాయకులు పరకాల టిక్కెట్ కోసం ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఈ ఇద్దరు నేతలు ఎవరికీ వారు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు కొత్త నేతలు ఎంట్రీ ఇచ్చారు. టిక్కెట్ మాకే అనే ధీమాతో ఉన్నారు. అన్ని హామీలతో పార్టీ కండువా కప్పుకున్నామని అప్పుడే కార్యకర్తలను ఏకం చేసే పనిలో పడ్డారు. వారిలో ఈ మధ్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ మావోయిస్ట్ జాగర్ల అశోక్ అలియాస్ ఐతు ఈ ఇద్దరు టిక్కెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు..హన్మకొండ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ నాయకుడు రెండు సార్లు గెలిచిన చరిత్రలేదు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి తన పేరిట సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నారు. కొత్త చరిత్రను సృష్టించారు. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా ప్రత్యేక గుర్తింపున్న కొండా సురేఖపై 2018లో గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటిదాకా పరకాలలో ధర్మారెడ్డికి నల్లేరుపై నడకలా సాగిన రాజకీయ ప్రయాణానికి బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే ఆశావహులు పెరగడం, MLA ప్రమేయం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు నియోజకవర్గంపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తిరిగి నిలబెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.దీంతో పరకాల టిక్కెట్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ.. ఇక్కడి నుండి బలమైన నేతను బరిలోకి దింపాలని యోచిస్తోంది. నర్సంపేట నుండి గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాశ్ రెడ్డి గతంలో భారతీయ జనతా పార్టీ చేరిపోయారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం పరకాల టిక్కెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం.. ఇక గాజర్ల అశోక్ అలియాస్ ఐతుకు కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. బీసీ నేత, ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం. ములుగు సీతక్క తరహాలోనే పరకాల నుండి మాజీ మావోయిస్టును బరిలోకి దింపడం వర్కవుట్ అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం బావిస్తుంది.టిక్కెట్ మాట దేవడెరుగు నలుగురు నేతలు తలోదారి పట్టడంతో పరకాలలో కాంగ్రెస్ నాలుగు ముక్కలైందని ద్వితీయ శ్రేణి క్యాడర్ తల పట్లు పట్టుకుంటున్నారు. పరకాల నియోజకవర్గంలో గెలుపు కోసం కసరత్తు చేస్తున్న పార్టీ నాయకత్వం ఈ ఆ అసంతృప్తి నేతలను ఎలా సంతృప్తి పరుస్తుందో చూడాలి…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్