- Advertisement -
మనుషుల్లో కాదు ఆచరణలో కల్తీ ఉంది-మాజీ మంత్రి శైలజనాథ్
There is corruption in practice, not in people - Ex-Minister Sailajnath
అనంతపురం
మనుషుల్ని కలుషితం చేసేలా మాట్లాడుతున్నారు.. ప్రతి ఒక్కరు కల్తీ గురించి మాట్లాడుతున్నారు.. మనుషుల్లో కాదు ఆచరణలో కల్తీ ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. విజయవాడ వరద బాధితులకు అసలు ఏమి చేసింది ప్రభుత్వం.. నష్ట పరిహారం ఎంత ఇచ్చారనేది ఆన్లైన్ లో పెట్టండని అన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే లు ఊక దంపుడు ప్రసంగం లా మాట్లాడకండి.. వాస్తవం కంటికి కనపడేలా చెప్పండి. విశాఖ ఉక్కు ఫ్యాక్తరి అంశం పై చంద్రబాబు నాయుడు పైపై మాటలతో అన్యాయం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజి ఏమైంది. కాంగ్రెస్ పార్టీ గా డిమాండ్ చేస్తున్నాము… ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టకుండా డైవరషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ జాబ్ నియామకాలు ఇవ్వండి. జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా తొందరగా ఇవ్వండి. వీటి గురించి ఆలోచన చెయ్యటం లేదు. గత ముఖ్యమంత్రి మోడీ కి దండం పెట్టారు.. మీరు పెడుతున్నారు. మోడీ నీ నవ్వించటానికి చంద్రబాబు నాయుడు ఇది కల్తీ లేని లడ్డు అని జోకులు వెయ్యటం ఎంత వరకు కరెక్ట్.. అసలు మీరు వెళ్ళింది నవ్వించటానికా..? ప్రత్యేక హోదా ఇస్తావా లేదా అని ఎందుకు అడగవు.. పూర్తి స్థాయి విశాఖ రైల్వే జోన్ ఇస్తావా లేదా.. అని ఇటువంటివి అడగాలి. అత్యంత దుర్మార్గమైన రాజకీయాలతో మాట్లాడుతున్నారు.. మతాల్ని, కులాల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం.. సనాతన ధర్మం గురుంచి కాస్త మాకు వివరంగా చెప్తే, మంచిది అయితే మేము పాటిస్తామని అన్నారు.
- Advertisement -