వైకాపాకు టీడీపీకి తేడా లేదు

- Advertisement -

వైకాపాకు టీడీపీకి తేడా లేదు

There is no difference between Vaikapa and TDP

వైఎస్ షర్మిల
విజయవాడ
విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ బుధవారం నాడు ధర్నా చౌక్ వద్ద అందోళన చెపట్టింది.  ఈ ధర్నా లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గోన్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది.  ఐదు నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఐదు నెలల్లో చుక్కలు చూపిస్తున్నారు. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారు.  ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు.  మొత్తం 17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు.  ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు ?  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారు.  వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారని అన్నారు.
తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు. వైసిపి 35 వేల కోట్లు భారం వేసింది అని చెప్పారు.  కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పారు. అధికారంలో వచ్చాకా మాట మార్చారు.  మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ?  ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ?  జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపితే… మీ 5 నెల్ల పాలనలో 17 వేల కోట్లు భారమా ?. ఇది న్యాయమా చంద్రబాబు ?  విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు.  అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి.  కానీ భారాన్ని ప్రజల పై ఎందుకు మోపుతున్నారు ?  చంద్రబాబు సమాధానం చెప్పాలి.  ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.  గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ?  బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకు రండి.   కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి.  బీజేపీ కి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా.  బీజేపీ కి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా.  ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఊరుకోం.  వెంటనే సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని అన్నారు.   కాదని ఎవరు అనడం లేదు. తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసిపి కి బుద్ధి చెప్పారు.  35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే ప్రజలు వైసిపి నీ ఓడించారు.  ఇది వైసిపి చేసిన పాపం అయితే… కూటమి పెడుతున్న శాపం.  వైసిపి కి కూటమి కి తేడా లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular