రైతు లేనిదే రాజ్యం లేదు

- Advertisement -

రైతు లేనిదే రాజ్యం లేదు

There is no kingdom without farmers

-ఆరోగ్యంగా కడుపు నిండా పట్టెడన్నం తింటున్నామంటే అది రైతు చలువే

-సింగిల్ విండో కార్యాలయంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

-మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని

రైతు లేనిదే రాజ్యం లేదని…రైతే దేశానికి వెన్నుముక అని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంథని సింగిల్విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ రైతులు పేరవేన లింగయ్య, కుడుదుల వెంకన్న, మూల పురుషోత్తం రెడ్డి, గుండా పాపారావు, నరేడ్ల ఓదెలు, పెంటరీ రవిలకు శాలువాలు, రైతు కండువాలు కప్పి ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు నారు వేసినప్పటి నుండి పంట చేతికచ్చే వరకు మట్టిలో మట్టయి రేయింబవళ్లు శ్రమిస్తే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదని, ఈ రోజు ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లె అని, అలాంటి రైతులు ఆరు నెలలు కష్టపడినా ఫలితం చేతికి దక్కుతుందనే నమ్మకం లేదని, అయినా సరే రైతులు మాతం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఒక వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అనునిత్యం రైతులను వెంటాడుతూనే ఉంటాయని, దేశాన్ని రక్షించే జవాన్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో… పట్టెడన్నం పెట్టే రైతన్నలకు అంతే ప్రాముఖ్యత ఉందని అన్నారు. అలాంటి అన్నదాతలకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. భారత దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23న రైతు దినోత్సవంగా జరుపుకుంటామని, ఇతను చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారి చట్టం రద్దయి కౌలు దారి చట్టం అమల్లోకి వచ్చిందని, రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వల్లే ఈ రోజు అనేక మంది రైతులకు రూ.2లక్షల రుణమాఫీ జరిగిందని అన్నారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు రైతులకు క్వింటాళ్ కు రూ.500 బోనస్ అందిస్తుండటంతో రైతుల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు. అలాగే రాబోయే సంక్రాంతి నుండి రైతు భరోసా కూడా అమలు కానుందని అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మండలంలోని రైతులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ల విజయ్ కుమార్, నాయకులు బెజ్జంకి డిగంబర్, సవాయి గణేష్, మంథని శ్రీనివాస్, కాసిపేట బాపు, ఆర్ల నారాయణ, సంఘ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular