- Advertisement -
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు–మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
There is no place for physical attacks democracy-Minister KomatiReddy Venkat Reddy
హైదరాబాద్ డిసెంబర్ 23
సినీనటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో కోమటిరెడ్డి ట్విట్ చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెంకట్ రెడ్డి వివరించారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో మృతి చెందిన రేవత్ కుటుంబానికి రూ.25 కోట్ల ఇవ్వాలని ఒయు జెఎసి నేతలు నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -