ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించుకోవడానికి, ఎన్నికల విధులలో ఉన్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాల్సివుంటుంది.
• వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఒకరికొకరు సమన్వయంతో పని చేయాలి.
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, సంగారెడ్డి జిల్లాలో గల 5 నియోజకవర్గాలైన నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి
, మరియు పటాన్ చెర్వు నియోజకవర్గంలో గల మొత్తం 822-పోలింగ్ లొకేషన్లు, 1437-పోలీంగ్ స్టేషన్స్, 156-రూట్స్ మొబైల్స్ ఉన్నాయని, శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి 2632 మంది పోలీసు సిబ్బంది, 2-ప్లటూన్ల టి.యస్.యస్.పి. సిబ్బంది, 29 -క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), 6-స్ట్రయికింగ్ ఫోర్స్ మరియు 4-స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ లతో బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో గల వివిధ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్ లను సందర్శించి, ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ చేస్తు, ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ సిబ్బంది మరియు కేంద్రబలగాలు, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని యస్.హెచ్.ఒ.లకు సూచించారు. పోలింగ్ కేంద్రాల విధుల్లో ఉండే సిబ్బంది ఏదైనా సమస్య వస్తే వెంటనే రూట్ మొబైల్ టీమ్ కు సమచారం అందించాలని ప్రతి రూట్ మొబైల్ టీమ్ తమ రూట్ లో ఎన్ని సాదారణ పోలింగ్ కేంద్రాలు, ఎన్ని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఉన్నాయో పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా చూడాలని, ఓటర్లలతో మర్యాదగా మాట్లాడాలని, అనవసర విషయాలు చర్చించవద్దన్నారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, అక్రమ డబ్బు, మద్యం పంపిణీ చేసే వారికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేదిలేదని, ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఉల్లంగిస్తే వారిపై చట్టరిత్య కఠిన చార్యలుంటాయన్నారు. ఎవరైనా పై చర్యలకు పాల్పడినట్లయితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అంధించాలని జిల్లా ప్రజాలకు సూచించారు.