- Advertisement -
దొంగలు నీతులు చెబుతున్నారు
Thieves are saying morals
విశాఖపట్నం
జగన్ ఇంట్లో ఒక మతం, బయట మరో మతం.. ఈ తమాషాలేంటో అని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మట్లాడుతూ.. జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు. దొంగలు నీతులు చెబుతుంటే.. వినడానికి కష్టంగా ఉందని,హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే అని చెప్పారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని,వైసీపీ హయాంలో 200పైగా ఆలయాల పై దాడులు జరిగాయని,ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు.
- Advertisement -