Friday, April 4, 2025

దాహ వేస్తోందంటూ  2 తులాల బంగారం చోరీ

- Advertisement -

దాహ వేస్తోందంటూ  2 తులాల బంగారం చోరీ

Thieves steal 2 tola gold on the pretext of quenching thirst

హైదరాబాద్, మార్చి 12

హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముందుగా రెక్కీ నిర్వహిస్తున్న దుండగులు పథకం ప్రకారమే చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు టార్గెట్ చేసుకుని రాత్రి, పగలు అనే తేడా లేకుండా మెడలో గొలుసు లాక్కొని పారిపోతున్నారు. కూకట్ పల్లి టెంపుల్ బస్టాండ్ దగ్గరలోని ఓ ఇంట్లో చోరి జరిగింది. తెల్లవారు జామున ఓ మహిళ ఇళ్లు ఊడుస్తుండగా అటుగా వచ్చిన వ్యక్తి త్రాగడానికి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఇంట్లోకి వెళ్లిన మహిళను చూసి చుట్టు పక్కల ఎవరూ లేరని గమనించిన దొంగ చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి ఆ మహిళ మెడలోని రెండు తులాల బంగారపు గొలుసుని దోచుకెళ్లాడు. భయంతో ఆ మహిళ ఆ దొంగ వెంట పరుగులు తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు.. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తా అంటూ నమ్మించి, మెడలో గొలుసు లాక్కెల్లాడు చైన్ స్నాచర్. శ్రీకాకులం జిల్లా పలాస మండలం కోసంగిపురంలో జరిగింది ఈ ఘటన. భర్త కోసం హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్న యశోదను చైన్ స్నాచర్ టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. ఓ తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించాడు. మెడలో ఉన్న తాళిని తెంచుకెళ్లాడు. దీంతో ఆమె స్థానికులకు జరిగింది చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఉదయంపూట అందరూ తిరుగుతన్న టైమ్ లోనే కేపీహెచ్‌లో ఇలాంటి ఘటన జరగడంతో.. కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైన్ స్నాచర్లు ఇంతకి తెగించారా అంటూ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమరాలో రికార్డ్ అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చిత్తూరులో యాక్షన్‌ సినిమాను తలిపించే సీన్‌ జరిగింది. తెల్లవారుజామున ఓ షాపింగ్‌ సెంటర్‌లోకి ఎంటరైన దొంగల ముఠా.. డమ్మీ గన్స్‌తో చోరికి యత్నించింది. యజమానిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. చాకచక్యంగా దొంగల ముఠా నుంచి తప్పించుకున్న ఓనర్‌..షెటర్‌ను క్లోజ్‌ చేసి దొంగలను నిర్భందించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్స్‌తో రంగంలోకి దిగిన పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఆక్టోపస్‌ను రప్పించారు. అప్పటికే స్థానికులతో కలిసి దొంగలు ఉన్న షాప్‌ను చుట్టుముట్టారు. తప్పించుకునేందుకు దొంగలు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు బిల్డింగ్‌లపై నుంచి జంప్‌ చేస్తూ వెంబడించారు. స్థానికులతో కలిసి నలుగురు దొంగలను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ దొంగల ముఠా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. ఒకరు చిత్తూరుకు చెందినవాడు కాగా, ముగ్గురు అనంత, మరో ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్