- Advertisement -
దొంగలు బాబోయ్ దొంగలు
Thieves, thieves everywhereకాకినాడ
కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరం, రూరల్ రెండూ కలిసి ట్విన్ సిటీస్ గా ఉంటాయి. అయితే రూరల్ కు దొంగల భయం పట్టుకుంది .ప్రతిరోజు దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇళ్లకు తాళాలు వేసినప్పుడు తమకు చెప్పండి అని చిన్న సందేశం ఇచ్చి వదిలేస్తున్నారు.. నేరాలు అదుపులో రూరల్ వైఫల్యం చెందింది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .
వాయిస్: రాత్రి పడితే చాలు ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గత కొంతకాలంగా కాకినాడ రూరల్ లో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో దొంగతనాలు పెరిగిపోయాయి.ముసుగుదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం చైతన్యనగర్ లో జరిగిన చోరీకి సంబంధించి సి సి కెమెరా ఫుటేజ్ బయటపెట్టారు.దీంతో ప్రజల్లో మరింత భయం పెరిగింది .జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు భయంతో కోరుతున్నారు.
- Advertisement -




