33.3 C
New York
Tuesday, July 16, 2024

రేపే రంగ రంగ వైభవంగా

- Advertisement -

రేపే రంగ రంగ వైభవంగా

Tomorrow is the glory of Ranga Ranga :

హైదరాబాద్:జులై 11
ఆసియా లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు,వివాహం శుక్ర వారం ముంబైలో వివాహం జరగనుంది .

ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రము ఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. వీరిలో అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా ఉన్నారు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో సౌదీ అరామ్‌కో సీఈవో అమిన్ నాసర్, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ భారతీయ సంతతికి చెందిన సీఈవో శంత నారాయణ్, తోపాటు

మోర్గాన్ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రా నిక్స్ చైర్మన్ జే లీ, ముబాద లా,ఎండి ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సిఇఒ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు.

అద్దెకు 100కుపైగా విమానాలు

శుక్రవారం (రేపు)ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్‌లు, 100కుపైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు.

అన్ని వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరుగుతాయి. ఈ జంట వివాహం రేపు జరగనుండ గా, ఆ తర్వాత జూలై 13న శుభ ఆశీర్వాదాల కార్యక్ర మం, చివరగా జూలై 14న వివాహ రిసెప్షన్ వేడుక ఉంటుంది.

ఈ కార్యక్రమాలన్నీ ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లె క్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి. దీంతో ఈ వివాహం దేశంలో అత్యంత ఖరీదైన వివాహాల లో ఒకటిగా పరిగణించబ డుతుంది..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!