రేపు పాఠశాలలు- కళాశాలలు బంద్‌…

- Advertisement -

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమ‌యిన సంగ‌తి తెలిసింది. గ‌త నెలలో స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు ప్రారంభమ‌య్యాయి. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా రేపు (జులై 4) పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు (SIF, AISF, PDSU, PDSO, NSUI) బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఎన్‌టిఎ రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని, SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన ఐదు సంవ‌త్స‌రాల‌లో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయ‌ని, వీటిపై ప్ర‌ధానమంత్రి నరేంద్ర‌మోది పార్లమెంట్‌లో సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. కేవ‌లం నీట్, నెట్ ప‌రీక్ష‌లు మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యాశాఖపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
విద్యార్థుల జీవితంలో పరీక్షలు ఎంతో కీల‌క‌మైన‌వి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని వారు సూచించారు. దేశంలో విద్యావ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రేపు (జులై 4న) దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపినిచ్చాయి. ఇందులో భాగంగా విద్యార్థి లోకమంతా బంద్‌లో పాల్గొని బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరాయి.
బంద్‌లో భాగంగా తరగతులను బహిష్కరించి, ర్యాలీలు, నిరసనలు తెలపాలని విద్యార్థి లోకానికి పిలునిచ్చాయి. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలని, నీట్ పరీక్షలు రాసిన విద్యార్ధులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ల‌తో రేపు దేశ‌వ్యాప్తంగా విద్యార్థిసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular