అదిలాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే): అసెంబ్లీ ఎన్నికల వేళ నిర్మల్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల తరపున బలమైన అభ్యర్థులు నిలుస్తుండటంతో… త్రిముఖ పోటీ తప్పేలా లేదని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిర్మల్ నియోజక వర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది, ప్రస్తుతం గత 2014 నుండి బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే నిర్మల్ నియోజవర్గంలో ఈసారి పోటీలో నిలబడే వివిధ పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అనుచరులు కావడం విశేషం, 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికి ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ, ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ, ఒక్కొక్కసారి ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీ, భోజన సమాజ్ పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ సైతం గెలుపొందాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజవర్గంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి రాజకీయ వ్యూహలు రచిస్తున్నారు.నిర్మల్ నియోజవర్గంలో ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేసింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి పార్టీ నుండి మహేశ్వర్ రెడ్డి ఖరారు కానున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూచాడి శ్రీహరి రావు లు పోటీ చేస్తున్నారు. ముగ్గురు ప్రముఖ నేతలు కావడంతో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందో నని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు, బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. రెండుసార్లు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగారు. తాను నియోజవర్గంలో చేసిన అభివృద్ధి, టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తప్పకుండా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చేవరకు బీఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతూ వస్తున్న మంత్రి అనుచరుడు కూచాడి శ్రీహరి రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు, గత తొమ్మిది సంవత్సరాల కాలంగా మంత్రి అనుచరులుగా కొనసాగిన శ్రీహరి రావు పార్టీలో విభేదాలు తలెత్తడంతో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండుసార్లు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయరు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగి గెలుస్తానని భీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ నుంచి ఏలేటి మహేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీకి రెండు సీట్లు దక్కగా, అందులో ఒకటి నిర్మల్ నియోజకవర్గం కావడం విశేషం. అంతటి ఆదరణ ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి పై స్వల్ప మెజారిటీ తొమ్మిది వేల ఓట్ల తో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి రేవంత్ రెడ్డికి , మహేశ్వర్ రెడ్డి కి మధ్య పడి రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు. ప్రస్తుతం బిజెపి పార్టీ నుంచి నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.గతంలో జరిగిన ఎన్నికలలో నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూచాడి శ్రీహరి రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు ఓడిపోయారు. అయితే ఈసారి పార్టీ కండువాలు మార్చుకొని ప్రజల సానుభూతి ఓట్లు తమకే పడతాయని ఇద్దరూ ఆశలు ఉన్నారు. అయితే సాధారణ ప్రజలు ఏ పార్టీ కి పట్టం కడుతారో వేచి చూడాల్సి ఉంది, ఇరు పార్టీల నాయకులు ఇటీవలే పార్టీలు మారడంతో సాధారణ ప్రజలు తికమక పడుతున్నారు. తమ నాయకులు ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలియకుండా ఉందని చర్చించుకుంటున్నారు. గత రెండు నెలల క్రితం వరకు ఒకరు కాంగ్రెస్ మరొకరు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. ఇటీవలే పార్టీ కండువాలు మార్చుకొని బీ ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్లోకి కూచాడి శ్రీహరి రావు, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి మహేశ్వర్ రెడ్డి పార్టీలు మారారు. దీంతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.