- Advertisement -
పటాన్ చెరు లో మన్మోహన్ సింగ్ కు నివాళులు
Tributes to Manmohan Singh in Patancheru
సంగారెడ్డి
పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, స్థానిక కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మనోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు . బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరై మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని, దేశ అభివృద్ధిలో ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటు అని తెలిపారు.
- Advertisement -