- Advertisement -
తిరుపతి ఎయిర్ పోర్ట్ లో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
TTD Chairman BR Naidu inspected Srivani Trust counter at Tirupati Airport.
తిరుపతి,
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందుతున్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విమానాశ్రయంలోని కౌంటర్లలో టికెట్ల పొందుతున్న భక్తులు టిటిడి ఛైర్మన్ ముందు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విమానాశ్రయంలోని కౌంటర్లో భక్తులు రోజు వారీ టికెట్లు ఎన్ని తీసుకుంటున్నారని
కౌంటర్ సిబ్బందిని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -