21.2 C
New York
Friday, May 31, 2024

టీటీడీపీ, జనసేనలు కమలానికే మద్దతు

- Advertisement -

టీటీడీపీ, జనసేనలు కమలానికే మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 8,
తెలంగాణ లో లోక్‌సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అత్యధిక సీట్లు గెల్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ రేసులో ఉంటే సిట్టింగ్ సీట్లు అయినా గెల్చుకుని .. తమ ప్రభావం తగ్గలేదని నిరూపించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. జాతీయ స్థాయిలో నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని గట్టి నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో అన్ని వర్గాల మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఆ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చిన బీజేపీకి ఈ సారి టీడీపీతో ఏపీలో మాత్రమే పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ కారణంగా ఆ పార్టీ మద్దతు దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ పార్లమెంట్ సీట్లలలో పోటీ చేయడం లేదు. అందకే ఆ పార్టీ కార్యకర్తల మద్దతు కూడా బీజేపీకే లభించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎలక్షన్ పోటీపై తెలంగాణ తెలుగుదేశం, జనసేన పార్టీ ఎలాంటి ఆసక్తి చూపిచడం లేదు. ఆ రెండు పార్టీల నేతలు కూడా ఇప్పటికే పోటీ ఆలోచన వదిలేసుకున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తతులు పెట్టుకున్న క్రమంలో ఈ సారి తెలంగాణలో పోటీ చేస్తున్న బీజేపీకే మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బి ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు కూడా లేరు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయంతో విబేధించి బిఆర్‌ఎస్‌లో చేరిపోగా ఆ స్థానాన్ని అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు భర్తీ చేయలేక పోయారు. ఇప్పుడు కాసాని బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. చంద్రబాబుకు ఏపీ రాజకీయాలు కీలకం కావడంతో తెలంగాణపై దృష్టి పెట్టడం లేదు. ముందు ఏపీలో గెలిసచి వద్దామని.. తర్వాత తెలంగాణపై దృష్టి పెడతామని ఆయన నేతలకు సర్ది చెబుతున్నారు. ఏపీలో గెలిస్తే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇద్దామని చెబుతున్నారు. ఏపీలో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ బంధం ఇక్కడ తెలంగాణలోనూ పరోక్షంగా అయినా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ఏపీపైనే దృష్టి కేంద్రీకరించారు ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచిన తీరాల్సిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న చంద్రబాబు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీపై అసలు ఆలోచన చేయలేదు. అందుకే బీజేపీకి మద్దతు ప్రకటించాలా లేదా అన్నదానిపైనా చర్చల జరపలేదు. నిజానికి ఖమ్మం ఎంపీ సీటులో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీలతో అసెంబ్లీ సీట్లలో గెలుచుకుంది. బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. ఈ కారణంగా కొన్ని సమీకరణాలను చూసి… ఎన్డీఏ కూటమి తరపున టీడీపీని పోటీ చేయించాలన్న ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఏపీ ఎన్నికలపై నుంచి దృష్టి మరల్చే ఆలోచనలో లేని టీడీపీ పెద్దగా ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ఏ మాత్రం చొరవ చూపించలేదు. అందుకే.. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పోటీ అనే మాట ఈ ఎన్నికల్లో వినిపించడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొత్తులు ఏపీకే పరిమితమని.. తెలంగాణకు సంబంధం లేదని జనసేన పొత్తు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రకటించారు. అయితే జనసేన, టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడంతో.. ఒక్క రాష్ట్రానికి పరిమితం కాకుండా.. అన్ని చోట్లా వారి పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. కానీ పోటీ చేయడానికి టీడీపీ, జనసేననే ఆసక్తి చూపించలేదని అనుకోవచ్చు. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓ ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీకి అధికారికంగా మద్దతు ప్రకటిస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నామినేషన్ల గడువుకు ఇంకా రెండు వారాలు ఉంది. ఆ తర్వాత అధికారికంగా ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికలకు ముందు అయినా ఈ రెండు పార్టీలు అధికారికంగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని తమ సానుభూతి పరులను కోరే అవకాశాలు ఉన్నాయి.టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏపీకి వెళ్తున్నారు. పలు జిల్లాలు పర్యటించిన అధినేత చంద్రబాబుకు మద్ద తు తెలిపి ఆయన ప్రచార కార్యాక్రమాల్లో పాల్గొని వచ్చారు. తాజాగా మరో సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నూ పాల్గొనుటకు వెళ్లున్నారు. టిడిపి సీనియర్ నేతలు బక్కని నర్సింహులు, సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ కాట్రగడ్డ ప్రసూనతో పాటు మరింత మంది సీనియర్లు ఏపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏపీలో గెలిచిన తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో ఎన్నికలపై మాత్రం టీడీపీ ఎలాంటి ఆశలు అంచనాలు పెట్టుకోవడం లేదు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!