- Advertisement -
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు
Tummala Ramaswamy Babu peddapuram Janasena party president prayaschitha deekshaపెద్దాపురం
తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పెద్దాపురంలో ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన జనసేన జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజవర్గ జనసేన ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఈ ప్రాయశ్చిత్త దీక్షకు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప కుటమి సభ్యులు నాయకులు విశ్వహిందూ పరిషత్ సాయి సేవ పలు హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు పాల్గొని మద్దతు తెలిపారు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు ప్రసాదంలో అపవిత్రత జరిగిందని దీనికి ప్రాయశక్తి దీక్షగా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈరోజు దీక్ష చేపట్టడం జరిగిందని ఈ దీక్ష నాలుగు గంటలవరకు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు, టిడిపి,బిజెపి, జనసేన పార్టీల నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -




