33.3 C
New York
Tuesday, July 16, 2024

గంజాయి విక్రయిస్తున్న పెడ్లర్ పట్టుబడ్డ ఇద్దరు జూనియర్ డాక్టర్లు..!!

- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న పెడ్లర్ పట్టుబడ్డ ఇద్దరు జూనియర్ డాక్టర్లు..!!
హైదరాబాద్
కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నేరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై గతంలో ఐదు కేసులు నమోదు అయ్యాయి. శనివారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు అయిన డాక్టర్ కె.మణికందన్, డాక్టర్ వి. అరవింద్ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన జూనియర్ డాక్టర్ లు టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఇద్దరు జూనియర్ డాక్టర్ లతో పాటు గంజాయి పెడ్లర్ ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!