రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు

- Advertisement -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు

Two killed and three injured in a road accident

గన్నవరం
చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నవరం పట్టణ శివారులో ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్ కు తరలించారు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular