- Advertisement -
అనుమతుల్లేని ఆసుపత్రి సీజ్
Unauthorized Hospital's Sieged
కూకట్ పల్లి
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారి సీజ్ చేసిన ఘటన కూకట్పల్లి కె.పి.హెచ్.బి కాలనీలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కె.పి.హెచ్.బి కాలనీ 5వ ఫేజులో అనుమతులు లేకుండా డాక్టర్ సుగుణాస్ ప్రీమియర్ డెర్మటాలజీ క్లినిక్ ను అనే ఆసుపత్రికి నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం అధికారులు క్లినిక్ లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణకు ఉపయోగించిన అనుమతి పత్రం, నకిలీ పత్రంగా గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి మాట్లాడుతూ గత 11 నెలలుగా ఈ క్లినిక్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారని డిఎంహెచ్వో వెల్లడించారు. సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు గురించి ఆరా తీస్తుంటే ఫేక్ డాక్యుమెంట్ ని చూపిస్తున్నారని దీనితో ఈ క్లినిక్ ను సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్లినిక్ నిర్వహణకై తమకు ఎటువంటి అప్లికేషన్ రాలేదనేది పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే సీజ్ చేయడం జరిగిందని, ఆసుపత్రి నిర్వాహకులు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
- Advertisement -