సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. రైల్వే జీఎం, ఇతర ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రం పునర్నిర్మాణం చేస్తోంది. గతేడాది ఈ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు దశల్లో పనులుండగా మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్ లో ప్రధాని మోడీ వందే భారత్ రైల్ ప్రారంభం తో పాటు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనాలకు శంకుస్థాపన చేశారు. ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు.
చర్లపల్లి స్టేషన్ దూరప్రాంతాల నుండి వచ్చేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రైల్వే స్టేషన్ మెట్రో రైల్, ఆర్టీసి బస్సులకు అనుసంధానంగా నిర్మాణం జరుగుతోంది. నరేంద్ర మోడీ మాట ఇస్తే దానిని నెరవేర్చకుండా ఉండరు అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో కూడుకొని ఉంటుంది. రైల్వే శాఖ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -