Friday, November 22, 2024

ఎర్రగడ్డలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

- Advertisement -

ఎర్రగడ్డలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Union Minister Kishan Reddy’s visit to Erragadda :

హైదరాబాద్
బస్తీబాట కార్యక్రమం లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ వాసవీ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  కమ్యూనిటీ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. తరువాత అక్కడ కమ్యూనిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గన్నారు.
ఈ సందర్భంగా వాసవి బృందావన్ సభ్యులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ సమస్యలు… లీకేజి సమస్య ను మంత్రి దృష్టికి తేవడంతో తన వెంట వచ్చిన అక్కడే ఉన్న సంభంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని అధికారులను ఆదేశించారు. రోడ్డుపై అడ్డంగా కరెంట్ స్థంబాలు ఉన్నాయని వాటిని తొలగించాలని చెప్పడంతో ఎలక్ట్రిసిటీ వారిని పిలిచి వాటిని తొలగించాలని కోరారు. అనంతరం స్థానికంగా ఉన్న బ్రీగెడ్ భవనం ముందు పార్కింగ్ సమస్య వాహదరులను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పడంతో..  స్థానిక సీఐ  ని పిలిచి పార్కింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వాసవి బృందావన్ సభ్యుల సమావేశం కిషన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపించిన మీ అందరికి ధన్యవాదాలు. ఎప్పుడు ఎలాంటి సమయంలో నైన మీ సమస్యలు తీర్చేందుకు మీ సవాళ్ళను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు ఆ అప్పులకు మిత్తులు కూడా కట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టి వేసాయి గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది . కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్ లకు ఇవ్వడానికి  కూడా డబ్బుకు లేవు టెండర్లు ఇవ్వలేక పోతున్నారు. తెలంగాణ లో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు మౌలికమైన వసతుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుతత్వం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నాయని అన్నారు. డిఫెనన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్, లాంటి  ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉంది  పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వాలకు కృషి చేయాలి.  ఇంట్రెస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి  అప్పుడే ప్రజల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి కానీ ఈ ప్రభుత్వానికి అవేం పట్టడం లేదు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను ఇన్ఫాస్ట్రక్చర్ కి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నానని అన్నారు.
నగరం పెరుగుతుంది కాబట్టి ప్రజల మౌలికవసతుల ఏర్పటుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుంది అది బ్యాలన్స్ లేకపోతే ముందు ముందు ఇన్వెస్ట్మెంట్ రావు . ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్తాగా ఎదిగిన భారత్ త్వరలో మూడో స్థానానికి ఎగబాకనుంది అ దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. వికసిద్భారత్ లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను ఆవిష్కరించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా కేంద్రం కట్టుబటి ఉంది. కానీ గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటే అనే విదంగా వ్యవహరించింది హైదరాబాద్ అంటే పాతభాస్థి అనే విషయాన్ని మర్చిపోయింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం పై ఒక ప్రణాళికే లేదు.  మీ ఆశీర్వాదం తో రెండోసారి గెలిచాక మోదీ  బోగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.
దేశానికి ఈ రోజు బొగ్గు లైఫ్ లైఫ్ లైన్ లాంటిది దేశంలో 85% పవర్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. నన్ను గెలిపించిన మీరు గర్వ పడేలా నేను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తాను. మీకు ఎక్కడ ఎలాంటి  ఇబ్బంది వచ్చిన మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఆఫీస్ ని సంప్రదించవచ్చు మీ సమస్యల్ని పరిష్కరించేందుకు నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్