20 C
New York
Tuesday, May 28, 2024

 కనిపించని సినీతారలు

- Advertisement -

 కనిపించని సినీతారలు
హైదరాబాద్, ఏప్రిల్ 24
కాలజ్ఞానం ఏం చెప్పిందో తెలియదుగానీ … దేశ రాజకీయాల్లో సినీరంగంనుంచి వచ్చిన చాలామంది రాజకీయాల్ని ప్రభావితం చేశారు. ఉన్నత పదువులు చేపట్టారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో రాజకీయాల్లో వారు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో సినీ తారల సందడి చాలా ఎక్కువగానే కనిపించింది. రాష్ట్రం విడిపోయి రెండు  తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఈ సందడి చాలా వరకు తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎలక్షన్ టైంలో సినిమావాళ్ల క్యాంపైన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. అయితే ఈ మధ్యన ఆ ఊపు తగ్గింది. మొన్న తెలంగాణా ఎలక్షన్స్ లో సినిమావాళ్ల ప్రచారాలు కనపడలేదు. సౌతిండియాలో సినిమా నటులు రాజకీయాల్లో ట్రెండ్ క్రియేట్ చేశారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటివారు రాజకీయాలకు కొత్త భాష్యాన్నే తెచ్చారు. తర్వాతి నుంచి ఎలక్షన్ టైమ్ లో సినిమావాళ్లు చేసే క్యాంపైన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటూ వస్తోంది. పర్టిక్యులర్ గా తెలంగాణలో ఈ మధ్యన ఆ ఊపు తగ్గింది. మొన్న జరిగిన తెలంగాణా ఎలక్షన్స్ లో సినిమావాళ్ల ప్రచారాలు కనపడలేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందో అనే భయం వారిని వెంటాడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్‌ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్‌ మాత్రమే పోటీ చేశారు. ఇక మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో సినిమావాళ్లు ఎక్కువ మందే వస్తారని ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. నిర్మాతలు దిల్‌ రాజు, రామ్‌ తాళ్లూరి, దర్శకుడు శంకర్‌, సినీ నటులు నితిన్‌, జీవిత, కత్తి కార్తీక తదితరులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. దిల్‌ రాజు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని తెగ ప్రచారం జరిగింది.  ఎలక్షన్ టైమ్ లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా మొదటి నుంచి బీఆర్‌ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. గతంలో ఆయన హైదరాబాద్‌ నగరంలోని ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి ఇంట్రస్ట్ చూపినా అదీ ఎందుకనో ముందుకు వెళ్లలేదు. ఈసారి కూడా ఆయన ఎలక్షన్ టైమ్ లో చిన్న ట్వీట్ కూడా చేయలేదు.మూడు ప్రదాన పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయశాంతి ఊసే కనబడటంలేదు, గొంతు వినబడటంలేదు. బీజేపీ మీద అసంతృప్తితో ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తంపార్టీలో చేరిన రెండుమూడురోజులు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కాని తర్వాత మాయమైపోయారు. ఆమె పార్టీలోనే ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున పార్టీ అధినేతలు, పెద్దలు ఉధృతంగా బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. మరి తనకు స్టార్ డమ్ ఉందని భావిస్తున్న విజయశాంతి మాత్రం ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క అభ్యర్ధి తరపున ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలు, సహజనటి జయసుధ ఊహించని విధంగా బీజేపీలోకి వచ్చారు. మాయమయ్యారు. ఆమెనెవరూ కాషాయ పార్టీలో పట్టించుకున్నట్లు లేదు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో తారల తళుకు బెళుకులు మాయమయ్యాయిహైదరాబాద్‌ నడిబొడ్డున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జన సముద్రం మధ్య ఎన్టీ రామారావు టీడీపీ ని  ప్రారంభించి.. దేశ రాజకీయాల్లోనే పెను ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత  ఆ స్థాయిలో సినీ తారలెవరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ప్రభావం చూపలేదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే ఆయన పార్టీ 18 స్థానాలకు పరిమితం అయింది. స్వయంగా చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట మాత్రమే గెలిచారు. తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ నుంచి పురుడు పోసుకున్న టీడీపీ రాష్ట్రంలో కనుమరుగైన స్థాయికి చేరుకుంది. 2014లో బాబు మోహన్ ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్గం నుంచి గెలిచినప్పటికీ.. 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నటి ‘జయసుధ’ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు.ఏపీ ఎలక్షన్స్ లో జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతూండటంతో చాలా మంది సినిమా వాళ్లు ఆయనకు సపోర్ట్ గా ప్రచారంలోకి వస్తున్నారు. మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ తరపున స్టార్ హీరో బాలకృష్ణ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినిమా వాళ్లు అంటే ప్రధానంగా రోజా, పోసాని కృష్ణ మురళి మాత్రమే కనపడతారు. సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రకరకాల వాదాలు, వివాదాలతో జనసేన పార్టీలోకి వెళ్లిపోయారు. దాంతో సామాన్యులే మన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అంటోంది ఆ పార్టీ

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!