
పండ్ల తోటల రైతుల ఆందోళన.! ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్! ________సూర్యాపేట: మే7 (వాయిస్ టుడే ప్రతినిధి). సూర్యాపేట జిల్లాలో ,వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం అకాల వర్షంతో ,వీచిన ఈదురు గాలులకు కోతకు వచ్చిన మామిడి, అరటి తోటలు పూర్తిగా రాలిపోయి పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారని , ఆత్మకూరు మండలం పిల్లలమర్రి ,ఎనుబాముల గ్రామాలలో రాలిన మామిడి తోటలను సూర్యాపేట జిల్లా ఉద్యానవన అధికారి టి. నాగయ్య , డివిజన్ అధికారి కన్నా జగన్ పరిశీలించారు. జిల్లాలో 10 మండలాల్లో మామిడి తోటల రైతులు నష్టపోయారని, 20 ఎకరాల్లో అరటి సాగు చేసిన రైతులు, అరటి తోటలు నేలకొరిగి నష్టపోయినట్లు, 1500 వందల ఎకరాల్లో 500 మంది రైతులు, నలుగురు రైతులకు చెందిన 20 ఎకరాల అరటి తోటలు నష్టం జరిగినట్లు, ప్రాథమిక అంచనాలు వేసి ప్రభుత్వానికి, పరిహారానికి సిఫార్సు చేయనున్నట్లు ఉద్యానవన జిల్లా అధికారి టి నాగయ్య తెలిపారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు రాలిన మామిడి తోటలను పరిశీలించి అంచనాలను యుద్ధ ప్రాతిపదికన జిల్లా కేంద్రానికి పంపాలని జిల్లా అధికారి టి. నాగయ్య తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ,నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇప్పించాలని రైతులు,పండ్లతోటల రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు.