- Advertisement -
పిడుగురాళ్ల ఆదర్శనగర్ లో సిపిఐ జెండా ఆవిష్కరణ
Unveiling of CPI flag in Adarsh Nagar
పిడుగురాళ్ల,
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ ఆదర్శ నగర్ కాలనీ లోని సిపిఐ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను పార్టీ నాయకులు, వయవృద్ధులు కొర్రపాటి చిన్న జాను చేతుల మీదుగా సిపిఐ పార్టీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకులు అక్కినపల్లి బాలయ్య మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో అన్ని కమిటీ గ్రూపులు కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ అనే మహా జ్వాల ఆవిర్భావానికి దారి తీసింది అని ఆయన అన్నారు. ఇది దేశ రాజకీయాల్లో జాతీయ ఉద్యమ ప్రస్థానంలో చారిత్రాత్మక అడుగు పడిందని అన్నారు. ప్రజా పోరాటాలకు, కమ్యూనిస్టుల ఉద్యమాలకు భయపడి సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టుల మీద అనేక కేసులు మోపడంతో పాటు ఉరికంబాలను ఎక్కించారన్నారు. వామపక్షాలన్నీ ఒకే వేదిక మీదికి రావడానికి సిపిఐ పార్టీ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, ఆలకుంట శ్రీనివాసరావు, నేషనల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర కార్యదర్శి పులిమెల కృపా సత్యం, ఎన్సీపీ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి ఎలకపాటి ఏసుబు, ఆదర్శనగర్ కాలనీకి చెందిన సిపిఐ పార్టీ నాయకులు గోదా కృష్ణ, శ్రీనివాసరెడ్డి, పూర్ణచంద్రరావు, అంకాలు వెంకటేశ్వర్లు కోటి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -