మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. అదే జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతమవుతుంది.
ఇంతకీ ఆ విషయం ఏంటంటారా? త్వరలో 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వెల్లడించారు. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నిన్న కరీంనగర్ లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు. పదేళ్లలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు తెలివి తక్కువ పొగరు ఎక్కువ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారుఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరని ఉత్తమ్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా?’ అని కేసీఆర్‌ను నిలదీశారు. మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఎడా పన్నావ్ అని ప్రశ్నించారు. ‘మాకు అభివృద్ధి చేయడం తెలుసు.. నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసు’ అని ఉత్తమ్ విమర్శించారు. అయితే బీఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకుంది. ఇక ఈ 39 మందిలో ఒకరు మరణించగా.. మరికొందరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఉత్తమ్ చెప్పినట్టుగా 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే ఇక కేసీఆర్ కుటుంబం మినహా దాదాపు కీలక నేతలెవరూ ఆ పార్టీలో లేనట్టే. ఇక ఉత్తమ్ మాటల్లో నిజమెంతుందనేది తెలియాల్సి ఉంది.