వైకాపా నేతలు శవరాజకీయాలు మానుకోవాలి
Vaikapa leaders should avoid chauvinism
నంద్యాల
నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల మీడియాతో మాట్లాడారు. ఎవరి వళ్ళ అయితే ఓడిపోయావో వాళ్ళ ను నమ్ముకొని నంద్యాల కు వచ్చాడి జగన్ మోహన్ రెడ్డి. ఛీ కొట్టిన నంద్యాల ప్రజల మధ్యకే జగన్ మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు. నంద్యాల శిల్పా వెంచర్ లో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేస్తే అప్పుడు ఎక్కడికెళ్లాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. కానిస్టేబుల్ ను రోడ్డుపై చంపితే అప్పుడు ఎక్కడికెళ్లాడు ఈ జగన్ మోహన్ రెడ్డి పైగా చంపిన వ్యక్తికి వైసీపీ కండువా కప్పాడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల లో వైసీపీ నాయకుల వేధింపులతో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నపుడు అప్పుడు ఎక్కడికెళ్లాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. నంద్యాల లో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఆక్రమణలు , హత్యలు , దాడులు జరిగాయి. ఇవన్నీ వదిలేసి ఈ హత్య కోసం నంద్యాల కు ఎలా వచ్చారు. హత్య చేసిన వాళ్ళు కూడా పోలీసులకు లొంగిపోయారు. రెడ్ బుక్ అంటే మీకెందుకు గుండెల్లో భయం పుడుతుందని అన్నారు. రెడ్ బుక్ అంటే ఎవరుఐతే విధులు అతిక్రమించారో వారు భయపడతారు. ఆ బుక్ అంటే మీరెందుకు భయపడుతున్నారంటే మీరు కుడా తప్పులు చేసినట్టేగా. నేడు మీడియా వాళ్ళు ఈ హత్య పై ఫోకస్ చేయండి అంటున్నాడు ఈ జగన్. కానీ ఈ 5 ఏళ్లల్లో మీడియా మిత్రులపై మీరెన్ని దాడులు చేసారో తెలియదా. జగన్ ప్రభుత్వంలో మీడియా వాళ్ళు ఒక్క ఆర్టికల్ రాయాలన్న భయం. కొంచెమైన సిగ్గుండాలి వైసీపీ నాయకులకు ఈ జగన్ మోహన్ రెడ్డి కి. ఇప్పటికైనా ఇలాంటి నాటకాలు, శవ రాజకీయాలు మానుకొండని అన్నారు.




