బాసర లో సామూహిక వరలక్ష్మి పూజలు….
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం చివరి శ్రావణమాసం కావడంతో శ్రీ వరలక్ష్మీఅమ్మవారివ్రతంతో పాటు సామూహిక కుంకుమార్చన పూజలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు,దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కుంకుమార్చన పూజ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు,వేద పండితులు వేదమంత్రోచ్ఛరణాల మధ్య సరస్వతి, మహాలక్ష్మి,మహాకాళి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 200 మంది మహిళలు సామూహికంగా కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులు సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ఒకరినొకరు మహిళలు వాయినాలు ఇచ్చుకున్నారు. శ్రావణమాసంలో సకల దేవతలకు పూజలు, వ్రతాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. చాణుక్యుల కాలంలో ఏర్పాటుచేసిన శ్రీ గాదె హనుమాన్ ఆలయంలో గ్రామస్తులు అందరూ కలిసి ఆలయపున నిర్మాణంలో భాగంగా శిఖర ప్రతిష్టన చేశారు, ముందుగా గ్రామస్తులు గ్రామంలో ఉత్సవ శిఖరాలను ఊరేగింపుగా తీసుకెళ్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు….